Mallapoor | మల్లాపూర్, అక్టోబర్ 9 : మల్లాపూర్ మండలంలోని సాతారం గ్రామానికి చెందిన బడే సునీల్ ఇటీవల విడుదల చేసిన గ్రూప్-2 ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చి బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గా ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా మాల మహర్ సేన సంఘం మండలాధ్యక్షుడు పులేరి రాము ఆధ్వర్యంలో గురువారం ఆయనను ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో నాయకులు గంగాధర్, రాజేందర్, దేవయ్య, ముత్యం, గోపి, బాలు, రాజేష్, భూమయ్య, రవి, చిన్నారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.