కరీంనగర్ : ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటమి కప్పిపుచ్చుకోవడానికి మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam )దివాలా కోరు మాటలు మాట్లాడుతున్నారని మాజీ మేయర్ యాదగిరి సునీల్ రావు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని స్తానాల్లో పోటీ పెట్టలేని నిస్సహాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అన్ని రకాల ప్రయోగాలు చేసినా సీఎం రేవంత్ రెడ్డి కూడా మూడు సభలు మూడు జిల్లాల్లో పెట్టి ప్రచారం నిర్వహించిన పట్టభద్రులు కాంగ్రెస్ ను తిరస్కరించారని పేర్కొన్నారు.
పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థి పార్టీలో సరైన నాయకుడు లేడని చెప్పాడని గుర్తు చేశారు. ఎన్నికలలో కాంగ్రెస్ చేసిన మోసాల హమీలను నమ్మలేదని పట్టభద్రులు తగిన బుద్ది చెప్పారని పెర్కోన్నారు. పొన్నం ప్రభాకర్ ఎంపీగా ఉన్నప్పుడు రాజీవ్ రహదారి అనేక అక్రమాలు జరిగాయని తెలిపారు. ముందుగా దీనిపై అవగాహన పెంచుకోవాలని పోన్నం ప్రభాకర్ కు సూచించారు. రాజీవ్ రహదారిలో జరిగే ప్రమాదాలకు కారణం కాంగ్రెస్ కాదా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ని గ్రూప్ రాజకీయాల వల్ల ఓటమి చెందిందన్నారు. కార్యక్రమలో అనూప్ కుమార్, ప్రవీణ్ సతీష్, నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.