Ramagundam | కోల్ సిటీ, జూన్ 7 : రామగుండం నగరపాలక సంస్థ కార్యాలయంలో హ్యాపీ సండే సందడి నెలకొంది. అధికారులు, ప్రజా ప్రతినిధులు ఆసనాలు.. ఆటలు పాటలతో ఆనందంగా గడిపారు. ఆరోగ్య కరమైన జీవనాన్ని ప్రోత్సహించడానికి ‘హ్యాపీ సండే’ కార్యక్రమం అవసరమని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. రామగుండం నగర పాలక సంస్థ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన హ్యాపీ సండే కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గత మార్చి నెలలో కూడా ఈ హ్యాపీ సండే కార్యక్రమాన్ని గోదావరి నది లో చెత్త ఏరి వేసిన తరువాత క్రీడా పోటీలు నిర్వహించి ఘనంగా చేపట్టినట్లు చెప్పారు. డిజిటల్ స్క్రీన్స్ కు అలవాటు పడి శారీరక , మానసిక సామర్థ్యాన్ని పెంచే యోగా, క్రీడలలో ప్రజలు భాగస్వాములు కాకపోవడం వల్ల రోగాల బారిన పడి హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ డబ్బులు ఖర్చు పెట్టు కోవాల్సిన దుస్థితి అలాగే అనేక ఇబ్బందులు పడే పరిస్థితి కూడా తలెత్తుతుందని అన్నారు.
ఈ నేపథ్యంలో మెట్రో నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ కార్యక్రమాన్ని స్థానికంగా నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఆరోగ్యం పై ఇప్పటికే కొంత మేర స్పృహ వచ్చిoదని నగరంలోని మైదానాలలో చాలా మంది కనిపిస్తున్నారని అన్నారు. ఇది శుభ పరిమాణమని అన్నారు. రామగుండం నగరాన్ని ఆరోగ్య నగరంగా తీర్చిదిద్దె ఎం ఎల్ ఎ ప్రయత్నం లో ప్రతీ ఒక్కరూ భాగస్వాములు కావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతపెల్లి ఎల్లయ్య, అదనపు కలెక్టర్ , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ , నగర పాలక సంస్థ టీపీఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ , సీనియర్ అసిస్టెంట్ శ్రీ పాల్ , ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ మధుకర్ , మెప్మా టి ఎం సి మౌనిక , యోగా గురు గణేష్, వ్యాయమ ఉపాధ్యాయులు శోభారాణి, తిరుపతి,దావీద్ సీవోలు, ఆర్పీలు, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమంలో భాగంగా యోగాతో పాటు కబడ్డీ, మ్యూజికల్ చైర్ పోటీలు నిర్వహించారు. పోటీలో విజేతలకు మెమెంటో, బహుమతుల ప్రదానం చేశారు.