చెన్నై : తీవ్ర వ్యతిరేకత వెల్లువెత్తిన దరిమిలా వామపక్షాలు, తమిళనాడు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) నిర్వహించే నిరసనల్లో విద్యార్థులు పాల్గొనకుండా నిరోధిస్తూ జారీ చేసిన వివాదాస్పద ఉత్తర్వును విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వం బుధవారం రద్దు చేసింది. ఆగస్టు 14న పాఠశాల, ఉన్నత విద్యా శాఖలకు జారీ చేసిన ఈ ఉత్తర్వును బుధవారం ప్రభుత్వం ఉపసంహరించుకున్నది.
ఈ ఉత్తర్వును సీజేపీ తీవ్రస్థాయిలో విమర్శించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమైన, అహేతుక చర్యగా సీజేపీ జాతీయ సహ కన్వీనర్ సౌరవ్ దాస్ అభివర్ణించారు. అయితే, బీజేపీ ఈ చర్యకు మద్దతు పలికింది. ఆ పార్టీ నేత వినోజ్ పీ సెల్వం సీజేపీ, వామపక్ష పార్టీలను అరాచక శక్తులుగా అభివర్ణించారు.