‘మ్యూజిక్ కంపోజింగ్ విషయంలో నేను సినిమా కథకు చాలా ప్రాధాన్యతనిస్తా. కథ మొత్తం విన్న తర్వాత దానికి ఎలాంటి సంగీత ప్రపంచాన్ని సృష్టించాలనేది ఆలోచిస్తాను. ‘ఇరుముడి’ కథలో భక్తి, సైకాలజీ, క్రైమ్, ఫ్యామిలీ సెంటిమెంట్..ఇలా అన్ని అంశాలున్నాయి.
ఇలాంటి సినిమాకు సంగీతాన్నందించడం పెద్ద సవాలు’ అన్నారు ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాష్‌కుమార్. ఆయన స్వరాల్ని అందించిన తాజా చిత్రం ‘ఇరుముడి’ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకురానుంది. రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించింది. బుధవారం జీవీ ప్రకాష్‌కుమార్ విలేకరులతో సినిమా సంగీత విశేషాలను పంచుకున్నారు.