చిగురుమామిడి, మే 12: మండలంలోని సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం అంగరంగ వైభవంగా సోమవారం వేదమంత్రాలు మధ్య వేద పండితులు నిర్వహించారు. సుందరగిరి ఆలయంలో చైర్మన్ సొల్లేటి శంకరయ్య పట్టు వస్త్రాలను స్వామివారికి సమర్పించారు. అనంతరం ఆలయ అర్చకులు శేషం నరసింహ చారి, సుధీరాచార్యులు, నవీన్ చార్యులు, శేషం సత్యనారాయణ చార్యులు, శ్రీనివాసచార్యులు స్వామివారిని కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పాల్గొని స్వామివారి కల్యాణాన్ని తిలకించారు.
భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ ఈవో, సిబ్బంది ఏర్పాటు చేశారు. భక్తులందరికీ తీర్థ ప్రసాదాలను అందజేశారు. భక్తులు అందజేసిన విరాళాలతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కొండపర్తి రాజ్ కుమార్, ఆలయ ఇన్స్పెక్టర్ పాము సత్యనారాయణ, జూనియర్ అసిస్టెంట్ బూట్ల కవిత, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతిరెడ్డి, సిగిల్ విండో చైర్మన్ జంగా వెంకటరమణారెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఓరుగంటి భారతీ దేవి, పాలకవర్గ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజువారీగా హోమం, గుట్ట చుట్టూ బండ్లు తిరుగుట, గ్రామంలోని ప్రధాన వీధులలో రథోత్సవంలో భాగంగా స్వామి వారిని ప్రధాన వీధులలో ఊరేగించడం జరుగుతుందని ఆలయ ఈవో రాజకుమార్, తెలిపారు.