KARIMNAGAR | కార్పొరేషన్, ఏప్రిల్ 3 : కరీంనగర్లోని 45వ డివిజన్లో సుడా నిధులతో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాల పనులను సుడా చైర్మన్ కే నరేందర్ రెడ్డి గురువారం ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగర సమస్యలు పరిష్కరించేందుకు చూడాలనుంచి నిధులు కేటాయించి పనులు చేపడతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ పిట్టల వినోద శ్రీనివాస్, అధికారులు రాజేంద్రప్రసాద్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.