తెలంగాణచౌక్, మే8: టీఎస్ ఆర్టీసీ కరీంనగర్ రీజియన్ మేనేజర్‌గా ఎన్ సుచరిత సోమవారం బాధ్యతలు స్వీకరించారు. హైదరాబాద్ బస్ భవన్లో డీప్యూటీ సీటీఎంగా టూరిజం, ప్రాజెక్ట్స్ విభాగంలో పనిచేస్తున్న ఆమెను, పదోన్నతిపై కరీంనగర్ ఆర్ఎంగా బదిలీపై వచ్చిన విషయం తెలిసిందే. సోమవారం బస్టాండ్ కాంప్లెక్స్‌లోని ఆర్ఎం కార్యాలయంలో పదవీ బాధ్యతలు స్వీకరించగా, డిప్యూటీ ఆర్ఎం భీంరెడ్డి,
డిపో మేనేజర్లు ప్రణీత్, మల్లయ్య, పర్సనల్ మేనేజర్ చంద్రయ్య పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం అధికారులతో సమావేశం నిర్వహించారు. కాగా, ఇక్కడ ఆర్ఎంగా పనిచేసిన ఖుస్రోషాఖాన్ బస్ భవన్‌కు బదిలీ అయ్యారు.