Nutritious food | కమాన్ చౌరస్తా, ఆగస్టు 23 : పౌష్టికరమైన ఆహారాన్ని విద్యార్థులకు ఇవ్వడం వల్ల వారు చాలా ఆరోగ్యంగా ఉంటారని, వారి కార్యకలాపాలను ఉత్సాహంగా పాల్గొంటారని అల్ఫోర్స్ విద్యా సంస్థల అధినేత డాక్టర్ వీ నరేందర్ రెడ్డి పేర్కొన్నారు. కొత్తపల్లిలోని అల్ఫోర్స్ ఈ-టెక్నో పాఠశాలలో వినుత్నంగా ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ ఎక్స్పో కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ, పౌష్టికరమైన ఆహారాన్ని తప్పనిసరిగా చిన్నతనం నుండే అలవాటుగా చేయాలని, దాని ద్వారా వారి ఎదుగుదలకు ఎటువంటి ఆటంకాలు ఉండవన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా ప్రాంగణంలో వివిధ రకాల పౌష్టికరమైన ఆహారాన్ని చేసేటువంటి వస్తువులతో చక్కగా అలంకరించారు. విద్యార్థులు వివిధ రకాల పౌష్టికర ఆహారాల గురించి స్పష్టంగా సమగ్రంగా సమాచారాన్ని ఇచ్చారు. ఎక్స్పోలో భాగంగా విద్యార్థులు పలు ఆసక్తికరమైన విషయాలను సందర్శకులతో పంచుకున్నారు. ముఖ్యంగా విద్యార్థులు తయారు చేసినటువంటి కార్బోహైడ్రేస్ సైకిల్, పవర్ఫుల్ ప్రోటీన్స్, విక్టోరియాస్ విటమిన్స్, ఆహారపు గొలుసు ఫుడ్ పిరమిడ్, ఆర్గానిక్ ఫామ్, ఒబెసిటీ సెంటర్, ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
వార్షిక ప్రణాళికలో భాగంగా అద్భుతమైన కార్యక్రమాన్ని రూపొందించిన పాఠశాల యజమాన్యానికి తల్లిదండ్రులు ప్రశంసిస్తూ విద్యార్థులను ఉత్తమంగా తీర్చిదిద్దుతున్న వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. భవిష్యత్లో ఇటువంటి కార్యక్రమాలను మరింత మరిన్ని రెట్టింప సంఖ్యలో చేపట్టి విద్యార్థుల్లో అవగాహనను విస్తృతంగా చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు.