Teacher Training | పెద్దపల్లి కమాన్ మే 22:విద్యార్థులను ఉన్నతoగా తీర్చిదిద్ది నవ సమాజ నిర్మాణానికి ఉపాధ్యాయులు మార్గ నిర్దేశకులు కావాలని ఉపాధ్యాయ శిక్షణ రాష్ట్ర పరిశీలకులు దుర్గా ప్రసాద్ పేర్కొన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం లోని జిల్లా ఫరిషత్ ఉన్నత పాఠశాలలో జరుగుతున్న ఉపాధ్యాయ శిక్షణ తరగతుల గురువారం ఆయన పరిశీలించి ప్రసంగించారు.
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని అందులో భాగంగానే ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు చెపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మండల విద్యాధికారి సురేందర్ కుమార్, డీఆర్పీలు, ఎంఆర్పీలు, సీఆర్పీలు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.