Students protest | కోరుట్ల, సెప్టెంబర్ 15 : కోరుట్ల పట్టణంలోని రామకృష్ణ డిగ్రీ, పీజీ కళాశాల విద్యార్థులు సోమవారం నల్ల బ్యాడ్జీలు లు ధరించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాలుగా విద్యార్థులకు బకాయి పడ్డ స్కాలర్ షిప్ బిల్లులు, కళాశాలకు చెల్లించాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ బిల్లులు వెంటనే విడుదల చేయాలని కళాశాల ఎదుట బైఠాయించి నిరసనకు దిగారు.
పెండింగ్ ఉన్న ఫీజు బకాయిలు చెల్లించకపోవడం వల్ల కళాశాలను నిర్వహించే పరిస్థితి యాజమాన్యాలకు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వెంటనే బకాయి పడ్డ ఫీజులను మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల యాజమాన్యం, అధ్యాపక బృందం, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.