కమాన్చౌరస్తా, ఏప్రిల్ 30 : పదో తరగతి ఫలితాల్లో కరీంనగర్ జిల్లా కేంద్రంలోని వాణీనికేతన్ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని విద్యాసంస్థల డైరెక్టర్ రేణుక పేర్కొన్నారు. పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రణీత్ కుమార్, శ్రేష్ట 571 మారులు సాధించారని, 21 మంది విద్యార్థులు 540కుపైగా, 44 విద్యార్థులు 500 మారులతో వంద శాతం ఉత్తీర్ణత సాధించారని చెప్పారు. అనంతరం విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు.