Chigurumamidi | చిగురుమామిడి, జూన్ 18 : విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలని జిల్లా విద్యాధికారి (డీఈవో) ప్రశాంత్ రెడ్డి అన్నారు. చిగురుమామిడి మండలంలోని ఇందుర్తి ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం వంట గదులను, పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం, పాఠ్యపుస్తకాలు, నోట్స్ పంపిణీ, ల్యాబ్, మొదలు రికార్డులను పరిశీలించారు. అనంతరం పదవ తరగతి గదిలో విద్యార్థులతో మాట్లాడారు.
విద్యార్థులు విద్యపై ప్రత్యేక దృష్టి సారించి విద్యా ప్రమాణాలు పెంపొందించుకోవాలన్నారు. సెల్ఫోన్, సినిమాలకు దూరంగా ఉండాలని విద్యార్థులకు సూచించారు. 100 శాతం ఉత్తీర్ణత సాధించే విధంగా విద్యార్థులు కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓ జయప్రద, ఉపాధ్యాయులు మంజుల, శ్రీదేవి, సరిత, భాషబత్తిని ఓదెలు కుమార్, తిరుపతి, వేణు, సూర్య ప్రకాష్, పవన్ కుమార్, చారి తదితరులు పాల్గొన్నారు.