సభా నియమాలు సమీక్షించాలి
కాలానుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సభా నియమాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సభ్యులు ప్రజా సమస్యలను సభలో సమర్థంగా ప్రస్తావించేందుకు, అర్థవంతమైన చర్చలు జరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేలా నిబంధనలు ఉండాలని సూచించారు.
- అర్థవంతమైన చర్చలు జరుగాలి
- శాసనమండలి రూల్స్ కమిటీ భేటీలో గుత్తా సుఖేందర్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): కాలానుగుణంగా, మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా సభా నియమాలను సమీక్షించాల్సిన అవసరం ఉన్నదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అభిప్రాయపడ్డారు. సభ్యులు ప్రజా సమస్యలను సభలో సమర్థంగా ప్రస్తావించేందుకు, అర్థవంతమైన చర్చలు జరిగేందుకు అవసరమైన వాతావరణాన్ని కల్పించేలా నిబంధనలు ఉండాలని సూచించారు.
తెలంగాణ శాసనమండలిలోని కమిటీ హాల్లో రూల్స్ కమిటీ ప్రాథమిక సమావేశం మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా గుత్తా సుఖేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. చట్టసభల గౌరవం, ఔన్నత్యాన్ని కాపాడటంలో సభా నియమాలు అత్యంత కీలకమని పేర్కొన్నారు. తెలంగాణ శాసనమండలిని ఆదర్శంగా నిలిపేందుకు సభ్యులందరూ సమిష్టిగా కృషిచేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా రూల్స్ కమిటీ సభ్యులు పలు అంశాలపై తమ అభిప్రాయాలు, సూచనలను వెల్లడించారు. సమావేశంలో శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్‌తోపాటు సభ్యులు శంకర్‌నాయక్, శ్రీపాల్‌రెడ్డి, తీన్మార్ మల్లన్న, మంకెన కోటిరెడ్డి, బస్వరాజు సారయ్య, మలా కొమురయ్య, నెల్లికంటి సత్యం, శాసనమండలి సెక్రెటరీ డాక్టర్ వీ నరసింహాచార్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
PM Modi | ప్రభుత్వం మారినా రాష్ట్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్తాం.. తమిళనాడులో ప్రధాని మోదీ
Iran Warning | యెమెన్ విషయంలో జోక్యం వద్దు.. పాకిస్థాన్‌కు ఇరాన్ వార్నింగ్..!
Farmers Protest | కరెంట్ కోతలను నిరసిస్తూ సబ్‌స్టేషన్ వద్ద రైతుల వంటవార్పు
truck rams Durga idol procession | దుర్గా విగ్రహం ఊరేగింపుపైకి దూసుకెళ్లిన లారీ.. ముగ్గురు మృతి, పది మందికి గాయాలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

