Korutla | కోరుట్ల, మే 13 : విద్యార్థులకు విలువలతో కూడిన విద్య అందించాలని కోరుట్ల మున్సిపల్ చైర్ పర్సన్ తిరుమల వసంత పేర్కొన్నారు. కోరుట్ల పట్టణంలో ని ఓ ఫంక్షన్ హాల్ లో నియోజక స్థాయి ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక విద్యా వారోత్సవాలను విద్యాశాఖ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల, మెట్ పల్లి, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్, మేడిపల్లి, బీమారం, కథలపూర్ మండలాలకు ఆయా గ్రామాల సర్పంచ్ లు, మున్సిపల్ కౌన్సిలర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ పాఠశాలకు విద్యార్థులు క్రమం తప్పకుండా హాజరయ్యేలా ఉపాధ్యాయులు దృష్టి సారించాలని పేర్కొన్నారు.
డ్రాప్ అవుట్ లను తగ్గించి విద్యా వికాసానికి కృషి చేయాలని తెలిపారు. చదువుతోపాటు విద్యార్థుల్లో విలువలు, క్రమశిక్షణ పెంపొందే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెట్ పల్లి మున్సిపల్ చైర్మన్ లింబాద్రి, కోరుట్ల మున్సిపల్ వైస్ చైర్మన్ షాహిద్ ఉల్ హాథ్, మెట్ పల్లి వైస్ చైర్మన్ నవీన్, ఎంపీడీవో లు, మండల విద్యాధికారులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, సీఆర్పీలు, ఎమ్మార్సీలు తదితరులు పాల్గొన్నారు.