Shankarapatnam | శంకరపట్నం : మట్టిని అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవని కేశవపట్నం ఎస్సై శేఖర్ హెచ్చరించారు. కేశవపట్నం మండలం నుండి అక్రమంగా మట్టిని తరలిస్తున్న టిప్పర్లను ఆయన శుక్రవారం పట్టుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన పోలె సంపత్, శనిగరం ప్రశాంత్, హుజురాబాద్‌కు చెందిన అల్లం రాజేష్ అను వ్యక్తులు ఎలాంటి ప్రభుత్వ అనుమతి లేకుండా అక్రమంగా టిప్పర్ల ద్వారా మొరం రవాణా చేస్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు. విచారణ చేపట్టగా ఎలాంటి అనుమతులు లేకుండా మొరం తరలిస్తున్నట్లు తేలడంతో కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.