Strict action | రాయికల్, మే, 28 : ఆవులను, పశువులను అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్ఐ సుధీర్ రావు హెచ్చరించారు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఆవులు, పశువుల అక్రమ రవాణాను అరికట్టడానికి జగిత్యాల జిల్లా సరిహద్దు బోర్నపల్లి గ్రామంలో చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు ఎస్సై పేర్కొన్నారు.
నిత్యం చెక్ పోస్ట్ వద్ద పశువైద్యాధికారులు పర్యవేక్షణలో 24 గంటలు పోలీసులు అక్రమ రవాణా పై నిఘా పెడుతూ పశువుల అక్రమ రవాలను అరికట్టడం జరుగుతుందన్నారు. అదే విధంగా ఎవరైనా పశువుల అక్రమ రవాణా చేస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలనీ ఎస్ఐ పేర్కొన్నారు.