Illegal sand transportation | మల్లాపూర్, జూలై 2 : గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని స్థానిక తహసీల్దార్ రమేష్ గౌడ్ హెచ్చరించారు. మండలంలోని పాతదాంరాజ్పల్లి, వెంకట్రావుపేట గ్రామాల్లో అక్రమ ఇసుక రవాణాపై రెవిన్యూ అధికారులతో కలిసి బుధవారం దాడులు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాల్లో అక్రమంగా ఇసుక రవాణా చేస్తే తమకు ఎవరైన ఫిర్యాదు చేయవచ్చని తెలిపారు. ఈ దాడుల్లో పాతదాంరాజ్పల్లి శివారులో ఇసుక రవాణా చేస్తున్న ఓ ట్రాక్టర్, వెంకట్రావుపేటలో నిల్వ ఉన్న 20 ట్రిప్పుల ఇసుక డంపులను పట్టుకోని సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయబ్ తహసీల్దార్ శ్రీనివాస్, ఆర్ఐ రాజేష్, రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.