Gangaram | గంగారంలో వైభవోపేతంగా విగ్రహ ప్రతిష్టాపన
వీణవంక మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వైభవోపేతంగా నిర్వహించారు.

Gangaram | వీణవంక, మార్చి 8 : వీణవంక మండలంలోని గంగారం గ్రామంలో శ్రీ సీతాలక్ష్మణ హనుమత్ సమేత శ్రీరామచంద్ర స్వామి విగ్రహ ప్రతిష్టాపనోత్సవ కార్యక్రమాన్ని ఆదివారం వైభవోపేతంగా నిర్వహించారు. శేషం వెంకటరమణాచార్యులు, చెరుకుపల్లి నిఖిల్ ఆచార్యుల ఆధ్వర్యంలో ఈ నెల 5 నుండి ప్రతిష్టాపన ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. కాగా 8న సీతారామ చంద్రస్వామి ఆలయ శిఖర, ధ్వజస్తంభ యంత్ర ప్రాణప్రతిష్ట కార్యక్రమాలు కన్నుల పండువగా నిర్వహించారు.
వేలాదిమంది భక్తులు వీక్షిస్తుండగా వేదపండితుల మంత్రోచ్ఛారణాల మధ్య స్వామి వారు కొలువు దీరారు. ఆలయ కమిటీ చైర్మన్, మాజీ సర్పంచ్ పింగిలి కోమాల్రెడ్డి, ప్రధానకార్యదర్శి కాసం రాజిరెడ్డి ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్టాపన ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. కాగా గ్రామానికి చెందిన నల్ల అంజిరెడ్డి-లక్ష్మీ, రవీందర్రెడ్డి- సరిత దంపతులు రూ.10 లక్షలతో విగ్రహదాతలుగా వ్యవహరించగా ఆలయకమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించారు.
అనంతరం మహాన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంధ్య, ఉపసర్పంచ్ హరీష్, వార్డు సభ్యులు కనకం అనిల్, నరేందర్, మాజీ సర్పంచ్ పుల్లూరి కుమార్, మాజీ ఎంపీటీసీ కాసం వీరారెడ్డి, దేవాలయ కమిటీ ఉపాధ్యక్షులు సంపత్రెడ్డి, కోశాధికారి కుమారస్వామి, సహాయకార్యదర్శి పుల్లూరి కుమార్, సలహాదారులు, కార్యవర్గ సభ్యులు, గ్రామ పెద్దలు, మహిళలు, పురుషులు, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
The Paradise | ఓటీటీలోకి ‘ది ప్యారడైజ్’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
Kolkata stampede | తొక్కిసలాట ఘటనపై రాష్ట్రపతి, ప్రధాని సంతాపం.. రూ.2 లక్షల పరిహారం ప్రకటించిన ప్రధాని
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

