Adluri Laxman Kumar | ధర్మారం, సెప్టెంబర్ 5: గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని పలు గణేష్ మండపాలలో రాష్ట్ర మంత్రి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు గణేష్ ఉత్సవ కమిటీ సభ్యులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జక్కన్నపల్లి, హనుమాన్ బస్తీ, పెద్దమ్మ వాడ, గణేష్ నగర్, కుమ్మరివాడలో ప్రతిష్టించిన గణేష్ మండపాలను ఆయన సందర్శించారు.
ఈ సందర్భంగాఆయన ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అర్చకులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా మండపాలలో లక్ష్మణ్ కుమార్ ను ఉత్సవ కమిటీ సభ్యులు శాలువాలతో సన్మానించారు. గణేష్ నిమజ్జనాన్ని ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని మంత్రి లక్ష్మణ్ కుమార్ ఉత్సవ కమిటీ సభ్యులకు సూచించారు. ఆయన వెంట ఏఎంసీ చైర్మన్ లావుడియా రూప్లా నాయక్, వైస్ చైర్మన్ అరిగే లింగయ్య, మాజీ వైస్ చైర్మన్ పాలకుర్తి రాజేశం గౌడ్, పార్టీ నాయకులు జంగ మహేందర్, దాగేటి ఉదయ్ యాదవ్, వీ.శంకరయ్య తదితరులు ఉన్నారు.