ధర్మారం, నవంబర్ 11 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయం ఆవరణలో మంగళవారం నిర్వహించిన ఉచిత నేత్ర వైద్య శిబిరానికి స్పందన లభించింది. కరీంనగర్ లోని రేకుర్తి కంటి దవాఖాన సౌజన్యంతో స్థానిక లయన్స్ క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేశం, ప్రోగ్రాం కన్వీనర్, జిల్లా పిఆర్ఓ తన్నీరు రాజేందర్ ఆధ్వర్యంలో ఈ శిబిరం నిర్వహించారు. రేకుర్తి కంటి దవాఖాన టెక్నీషియన్ ప్రభాకర్ రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు.
సుమారు 100 రోగులు ఈ శిబిరానికి హాజరు కాగా 30 మందికి కంటి లోపాలు ఉన్నట్లు నిర్ధారించి వారికి రేకుర్తి కంటి దవాఖానకు తరలించి ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇన్చార్జి తాసిల్దార్ ఉదయ్ కుమార్, ఎంపీడీవో ఐనాల ప్రవీణ్ కుమార్, మండల వైద్యాధికారి డాక్టర్ అనుదీ ప్ హాజరై నేత్ర వైద్య శిబిరాన్ని నిర్వహించిన లయన్స్ క్లబ్ సభ్యులను వారు అభినందించారు. ఈ శిబిరం వలన ఎంతోమంది నిరుపేదలకు కంటి చూపు మెరుగవడమే కాకుండా లోపాలు ఉన్నవారికి ఆర్థిక భారం లేకుండా ఉచితంగా శస్త్ర చికిత్స చేయడం ఎంతో ప్రశంసనీయమని వారు అన్నారు. ఇలాంటి శిబిరాలు మరెన్నో నిర్వహించి నిరుపేదలకు సహకారాన్ని అందించాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో క్లబ్ అధ్యక్షుడు ఇప్ప మల్లేశం, జిల్లా కన్వీనర్, పీఆర్వో తన్నీరు రాజేందర్, క్లబ్ జిల్లా అడ్మిన్ సామ ఎల్లారెడ్డి, జెడ్ సి పుచ్చకాయల మునీందర్, ఆర్ సి తలమక్కి రవీందర్ శెట్టి, ధర్మారం క్లబ్ కార్యదర్శి భూతగడ్డ రవి, కోశాధికారి మిట్టపల్లి చంద్రకాంత్ రెడ్డి, ఉపాధ్యక్షుడు నాడెం శ్రీనివాస్, క్లబ్ సభ్యులు చింతపండు నర్సింగం, అబ్దుల్ ముజాహిద్, కడారి కుమార్, ఈదుల శివకుమార్ రెడ్డి, ధర్మారం జిపి కార్యదర్శి కుడిక్యాల రవి తదితరులు పాల్గొన్నారు.