సీసీ కెమెరాలతో నేరాలకు అడ్డుకట్ట
సీసీ కెమెరాలతో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు.
- హుస్నాబాద్ ఎమ్మెల్యే సతీశ్‌కుమార్
- ప్రతి గ్రామంలో ఏర్పాటుకు ప్రజలు సహకరించాలి
- కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడు
- చిన్న ముల్కనూరు గ్రామంలో సీసీ కెమెరాల ప్రారంభం
చిగురుమామిడి, మార్చి 2: సీసీ కెమెరాలతో నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయవచ్చని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ పేర్కొన్నారు. మండలంలోని చిన్న ముల్కనూరు గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను గురువారం కరీంనగర్ పోలీస్ కమిషనర్ సుబ్బారాయుడుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, మారుతున్న కాలానుగుణంగా ఆధునిక సాంకేతికతో సీసీ కెమెరాలు అందుబాటులోకి వస్తున్నాయన్నారు. వీటిని ప్రతి గ్రామంలో ఏర్పాటు చేసుకోవడం ద్వారా నేరాలను నియంత్రించవచ్చన్నారు. సీపీ మాట్లాడుతూ, అనేక కేసుల ఛేదనలో సీసీ కెమెరాలు కీలకంగా మారాయన్నారు. వీటి ద్వారా నిందితులను గుర్తించడం చాలా సులువు అవుతుందన్నారు. పోలీసు శాఖ ఆధ్వర్యంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు గ్రామస్తులు సహకరించాలని కోరారు. మండలంలో సీసీ కెమెరాలు ఏర్పాటుకు కృషి చేస్తున్న ఎస్ఐ దాస సుధాకర్‌ను అభినందించారు.
కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన..
సీఎం కేసీఆర్ పాలనలో ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్ కుమార్ పేర్కొన్నారు. మండలంలోని సీతారాంపూర్ పాఠశాలలో డీఎంఎఫ్టీ, సీడీఎఫ్ నిధులు రూ.11.80 లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ గురువారం ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ, ప్రపంచంలో ఎకడా లేని విధంగా విద్యా విధానంలో సీఎం కేసీఆర్ మార్పులు తీసుకువచ్చారని కొనియాడారు.
సీఎం కేసీఆర్‌తో నియోజకవర్గ అభివృద్ధి
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని సీఎం కేసీఆర్ సహకారంతో అభివృద్ధి చేస్తున్నామని హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితల సతీశ్‌కుమార్ అన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన ఏర్పాటు చేసిన మండల సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. చిగురుమామిడి మండలంలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలు వెల్లడించారు. రైతులకు గోదావరి జలాలను అందించి వారి కళ్లల్లో ఆనందం నింపామన్నారు. త్వరలోనే గౌరవెళ్లి ప్రాజెక్టు ద్వారా హుస్నాబాద్ ప్రాంత రైతులకు సాగునీరు అందిస్తామన్నారు. మండలంలో రోడ్ల అభివృద్ధికి నిధులు మంజూరు చేశామని, పెండింగ్‌లో ఉన్న పనులు త్వరలోనే పూర్తి చేయిస్తామని తెలిపారు. అధికారులు యుద్ధ ప్రాతిపదికన ప్రణాళికలు రూపొందించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ కొత్త వినీతాశ్రీనివాస్ రెడ్డి, జడ్పీటీసీ గీకురు రవీందర్, సింగిల్ విండో చైర్మన్ జంగ వెంకటరమణ రెడ్డి, వైస్ ఎంపీపీ బేతి రాజి రెడ్డి, మారెట్ కమిటీ వైస్ చైర్పర్సన్ రామోజు రజిత, సింగిల్ విండో వైస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కొత్త శ్రీనివాస్ రెడ్డి, మండలాధ్యక్షుడు మామిడి అంజయ్య, సర్పంచుల ఫోరం మండలాధ్యక్షుడు జకుల రవి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి మల్లేశం, ఆర్బీఎస్ మండలాధ్యక్షుడు పెనుకుల తిరుపతి, జిల్లా సభ్యుడు సాంబారి కొమురయ్య, సర్పంచులు గోలి బాపురెడ్డి, లక్ష్మణ్, ముప్పిడి వెంకట నరసింహారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, బీఆర్ఎస్ నాయకులు, అధికారులు పాల్గొన్నారు.
Read Today's Latest Karimnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడు ఈదురు జనార్ధన్ కుటుంబానికి అండగా కేటీఆర్.. వీడియో
KTR Letter | రేడియల్ రోడ్ 2 టెండర్లలో జరిగిన రూ. 3,296 కోట్ల కుంభకోణంపై సమాధానం చెప్పాలి : రేవంత్‌కు కేటీఆర్ లేఖ
విద్యుత్ తీగలకు అడ్డమని పచ్చని చెట్ల నరికివేత
బోండాల కోసం కొబ్బరి చెట్టు నరికివేత.. వ్యక్తి పట్టివేత
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

