SRSP Canals | పెద్దపల్లి రూరల్ మే 29: వానాకాలం పంటలకు పంటపొలాలకు సాగునీరందే విదంగా ఎస్ఆర్ ఎస్ పి కాలువలను పూడిక తీతతో పాటు చెత్తా చెదారం, ముళ్ల పొదలు లేకుండా శుభ్రం చేయాలని పెద్దపల్లి ఎంపీడీవో కొప్పుల శ్రీనివాస్ అన్నారు. మండలంలోని పెద్దకల్వలలో జాతీయ గ్రామీణ హామీ పథకంలో చేపడుతున్న ఎస్ ఆర్ ఎస్ పి కాలువలను శుభ్రం చేసేపనులను గురువారం గ్రామాన్ని సంబంధిత అధికారులు సిబ్బందితో కలిసి సందర్శించి పరిశీలించారు.
ఈ సందర్భంగా అధికారులు, సిబ్బంది, ఉపాధీ కూళీలను పనులు జరుగుతున్న తీరు, సమస్యలను అడిగి తెలుసుకుని వర్షాలు పడుతున్న నేపథ్యంలో వేగవంతంగా పనులు పూర్తి చేయాలని సూచించారు. ఎంపీడీవొ వెంట గ్రామ పంచాయతీ కార్యదర్శి దేవరనేని నిశాంత్ రావు, సిబ్బంది, ఫీల్డ్ అసిస్టెంట్ తదితరులున్నారు.