కలెక్టరేట్, మార్చి 23 : ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యమకారుల కోసం వెంటనే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గతంలో ఇచ్చిన హామీలైన 250 గజాల ఇంటి స్థలం, నెలకు రూ. 25,000 పెన్షన్ వెంటనే అమలు చేయాలని కోరుతూ, టప్ ఆధ్వర్యంలో ఏప్రిల్-21న సికింద్రాబాద్ లో నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ సమావేశం విజయవంతం చేయాలని కోరుతూ, టప్ రాష్ట్ర శాఖ చేపట్టిన బస్సు చైతన్య యాత్ర ఆదివారం నగరానికి చేరింది. ఈసందర్భంగా నగరంలోని తెలంగాణ వీరుల స్థూపం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ఉద్యమకారుల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాల రూపంలో ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్న పట్టించుకోవటం లేదన్నారు.
కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలపై ఉద్యమకారులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వంపై మరింత ఒత్తిడి తెచ్చే క్రమంలోనే వచ్చే నెల 21న తెలంగాణ ఉద్యమకారుల ప్లీనరీ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అనంతరం గోడప్రతులు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కరీంనగర్ జిల్లా చైర్మన్ కనకం కుమారస్వామి, రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, ఐల ప్రసన్న, ఉమారాణి, మున్నక్క, అంజలి, కరీంనగర్ నియోజకవర్గం అధ్యక్షులు జంగపల్లి కుమార్, సరిత, విజయభాస్కర్ రెడ్డి, గాలి రమేష్ యాదవ్, దేవునూరి అంకుష్, భూమ సదానందం, తాటిపల్లి శంకర్, విజయభాస్కర్ రెడ్డి, మామిడి మొగిలి, శారద, రాజేశ్వరి, బొజ్జ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు.