Pittala Yellaiyapalle | ఓదెల, డిసెంబర్ 13 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం పిట్టల ఎల్లయ్య పల్లె గ్రామ ఉపసర్పంచ్ గా పెండెం శ్రీకాంత్ శనివారం ఎన్నికయ్యారు. ఇక్కడ సర్పంచ్, వార్డు స్థానాలకు ఏకగ్రీవంగా ఎన్నిక జరిగింది. శనివారం గ్రామపంచాయతీ కార్యాలయంలో ఎన్నికల అధికారి వార్డు సభ్యులతో సమావేశం నిర్వహించి ఉపసర్పంచ్ ఎన్నిక నిర్వహించారు.
ఇక్కడ 8 మంది వార్డు సభ్యులు ఉండగా ఉప సర్పంచ్ గా శ్రీకాంత్ ఏకగ్రీవంగా ఎన్నిక చేశారు. శ్రీకాంత్ ఉప సర్పంచ్ గా ఎన్నికైనట్టు ఎన్నికల అధికారి ధ్రువీకరణ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ యువకుడినైన తనను గ్రామస్తులు ఉప సర్పంచ్ గా ఎన్నుకున్నందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని తెలియజేశారు. ఉప సర్పంచ్ గా ఎన్నికైన శ్రీకాంత్‌ను సర్పంచ్ పిట్టల రవికుమార్ గ్రామస్తులు అభినందించారు.