Dharmaram | ధర్మారం, ఆగస్టు 28 : పెద్దపల్లి జిల్లా ధర్మారం పోలీస్ స్టేషన్ లో బదిలీపై వచ్చిన నూతన ఎస్సై ఎంబడి శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేసిన ఎస్సై ఎం ప్రవీణ్ కుమార్ కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాకు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అక్కడి ఎస్పీ కార్యాలయంలో వీఆర్లో ఉన్న ఎస్సై శ్రీకాంత్ ధర్మారం పోలీస్ స్టేషన్కు బదిలీపై వచ్చారు. దీంతో ఎస్సై శ్రీకాంత్ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఆయనకు తోటి ఉద్యోగులు శుభాకాంక్షలు తెలియజేశారు.