BasanthNagar SI | పాలకుర్తి : పాలకుర్తి మండలం బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా శ్రీధర్ బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఇక్కడ పనిచేస్తున్న ఎస్ఐ స్వామిని వీఆర్‌కు బదిలీ అయ్యారు. కాగా రామగుండం కార్పొరేషన్ లో ఉన్న శ్రీధర్ బసంత్ నగర్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యారు.
బసంత్ నగర్ పోలీస్ స్టేషన్లో నూతన ఎస్సైగా శ్రీధర్ పదవీ బాధ్యతలు చేపట్టగా ఎస్సై శ్రీధర్ కి స్థానిక పోలీసులు పూర్తిగా స్వాగతం పలికారు. మండలంలో శాంతి భద్రతలను కాపాడేందుకు ప్రతీఒక్కరూ కృషి చేయాలని కోరారు. బసంత్ నగర్, పాలకుర్తి మండలం పరిధిలోని పలు గ్రామాల్లో గంజాయి నిర్మూలన, ఇతర సమస్యలు పరిష్కారానికి సహకరించాలని చెప్పి ఎస్సై కోరారు.
sridhar assumes charge as Basant Nagar SI