Akhanda 2 |గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ- మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ అంటే ఎంత భారీ హంగామా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సింహా, లెజెండ్, అఖండ… వరుసగా బ్లాక్బస్టర్లతో ప్రేక్షకుల హృదయాల్లో మాస్ అంచాలను పెంచిన ఈ కాంబో ఇప్పుడు నాలుగోసారి కలసి రూపొందించిన చిత్రం “అఖండ 2 తాండవం”. ఇప్పటికే టైటిల్‌తోనే పాన్ ఇండియా స్థాయిలో ఎనలేని హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా విడుదలకు దగ్గర్లో ఉండటంతో ప్రచారం కూడా వేగంగా సాగుతోంది.
మేకర్స్ తాజాగా సినిమా ప్రీ-రిలీజ్ గ్రాండ్ ఈవెంట్ వివరాలను అధికారికంగా ప్రకటించారు. నవంబర్ 28న, హైదరాబాద్‌లోని కూకట్పల్లి – ఖైతలాపూర్ గ్రౌండ్స్‌లో ఈ వేడుకను అద్భుతంగా నిర్వహించబోతున్నారు.సాయంత్రం 5 గంటల నుంచి ఈవెంట్ ప్రారంభం కానుండగా, ఫ్యాన్స్ భారీగా హాజరు కానున్నారని అంచనా. బాలకృష్ణ – బోయపాటి కాంబినేషన్ కావడంతో ఈ ఈవెంట్లో పెద్ద సర్ప్రైజ్లు ఉంటాయని టాక్. కొత్త ట్రైలర్ లేదంటే కొత్త యాక్షన్ షూట్ ఫుటేజ్ , అవి లేకపోతే ప్రత్యేక అనౌన్స్మెంట్ ఏదో ఒకటి ఉంటుందని అభిమానులు ముచ్చటించుకుంటున్నారు .
సినిమా పాన్–ఇండియా లెవెల్లో డిసెంబర్ 5న గ్రాండ్‌గా థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇప్పటికే టీజర్, గ్లింప్స్‌కు వచ్చిన స్పందన చూస్తే బాలయ్య మరోసారి మాస్ ఫెస్ట్ తప్పదని అనిపిస్తోంది.అఖండ తాండవం మళ్లీ తెరపైకి రావడానికి కౌంట్‌డౌన్ మొదలైంది. 28న ఏయే సర్ప్రైజ్లు బయటకు వస్తాయో చూడాలి.ముఖ్య అతిథులపై సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఈవెంట్‌కు ఎవరెవరు రావచ్చనే విషయం ప్రస్తుతం అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా రావచ్చని , మరోవైపు, అల్లు అర్జున్ కూడా హాజరవుతాడు అనే చర్చ బాగా పెరిగింది. అయితే ఈ రెండు విషయాలపై ఇంకా నిర్మాతల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.