అమరావతి : ఏపీ రాజధాని అమరావతి ( Amaravati ) లో బుధవారం విద్యార్థులు నిర్వహించిన మాక్ అసెంబ్లీ ( Mock assembly ) ఆధ్యాంతం ఆకట్టుకుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా అసెంబ్లీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం చంద్రబాబు( Chandrababu ) , స్పీకర్ అయ్యన్నపాత్రుడు (Ayyannapatrudu ) , మంత్రులు లోకేష్, అనిత, అధికారులు తదితరులు హాజరై మాక్ అసెంబ్లీని తిలకించారు.
ఈ సందర్భంగా విద్యార్థులు అధికార, ప్రతిపక్ష పార్టీ నాయకులు, సభ్యుల మాదిరిగా చేసిన ప్రసంగాలు నవ్వులు పూయించాయి. చంద్రబాబు మాట్లాడుతూ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరికీ ఆదర్శప్రాయుడని అన్నారు.ఆయన చొరవ వల్లే నేడు బడుగు, బలహీన వర్గాల ప్రజలకు రాజ్యాంగ హక్కులు లభ్యమవుతున్నాయని పేర్కొన్నారు.

సంక్షేమం, దేశ భవిష్యత్ కోసం అనేక తనకు లెక్చరర్‌గా అవకాశమిస్తే ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందానని నాటి జ్ఞాపకాలను వివరించారు. ఎవరికైనా సంక్షోభాలు ఎవరికైనా సహజమని, వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలని సూచించారు. మాక్ అసెంబ్లీలో విద్యార్థులు తడబడకుండా ప్రదర్శన చేశారని అభినందించారు.
అమెరికా అధ్యక్షులుగా ఇప్పటి వరకూ మహిళ ఎన్నిక కాలేదని, భారత దేశంలో మహిళలు, ప్రధాని, రాష్ట్రపతి, మంత్రులయ్యారని వెల్లడించారు. బాధ్యతలు నిర్వర్తించకుండా హక్కుల కోసమే పోరాటం సబబుకాదని, రాజ్యాంగం కంటే ఎవరూ గొప్పకాదని ప్రతి ఒక్కరూ గ్రహించాలన్నారు.