పెద్దపల్లి, నవంబర్ 25 : యాదవ చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో ఈ నెల 28న మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు యాదవ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు శిలారపు పర్వతాలు తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్లో మంగళవారం వారు విలేకరులతో మాట్లాడారు.
ట్రస్టు 9వ వార్షికోత్సవం సందర్భంగా జాబ్ మేళా చేపడుతున్నామని, వెయ్యి మందికి ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్రణాళికలు చేసినట్లు వివరించారు. పెద్దపల్లి సబ్ రిజిస్ట్రారు కార్యాలయం వద్ద ఉదయం 10 గంటల నుంచి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారని వెల్లడించారు.