Karthi | కోలీవుడ్ స్టార్ యాక్టర్ కార్తీకి తెలుగులో సూపర్ ఫ్యాన్ బేస్ ఉందని ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. చివరగా నాని నటించిన హిట్ 3లో కామియో రోల్లో మెరిశాడు కార్తీ. కాగా ప్రస్తుతం కార్తీ నటిస్తోన్న తమిళ చిత్రం వా వాథియార్. తెలుగులో అన్నగారు వస్తారు టైటిల్‌తో రాబోతున్న ఈ మూవీ డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇప్పుడు కార్తీ కొత్త సినిమాకు సంబంధించిన ఆసక్తికర వార్త ఇప్పుడు మూవీ లవర్స్‌తోపాటు ఇండస్ట్రీ వర్గాల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. మ్యాడ్ ప్రాంచైజీతో బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు డైరెక్టర్ కల్యాణ్ శంకర్. ఈ క్రేజీ డైరెక్టర్ ఇప్పటికే రవితేజతో సినిమా చేసేందుకు రెడీ కూడా అయ్యాడు. కల్యాణ్ శంకర్ తాజాగా కార్తీతో కొత్త ప్రాజెక్టును లైన్లో పెట్టాడన్న వార్త ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.
టాలీవుడ్లో వన్ ఆఫ్ ది లీడింగ్ ప్రొడక్షన్ హౌస్‌గా కొనసాగుతున్న సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్య దేవర నాగవంశీ ఈ మూవీని నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నాడని ఇన్సైడ్ టాక్. అన్నీ అనుకున్నట్టుగా కుదిరితే రానున్న రోజుల్లో ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుందని అర్థమవుతోంది. కార్తీ ఖాతాలో మరోవైపు స్పై యాక్షన్ థ్రిల్లర్ సర్ధార్ 2 ఉన్న విషయం తెలిసిందే. 2026లో సర్ధార్ 2 థియేటర్లలో సందడి చేయనుంది.
Sampath Nandi | దర్శకుడు సంపత్ నంది ఇంట్లో విషాదం .. సినీ ప్రముఖులు సంతాపం