iQOO 15 | ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్లను రూపొందించి అందించడంలో ప్రస్తుతం చాలా వరకు కంపెనీలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగానే అద్భుతమైన ఫీచర్లు కలిగిన ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. వినియోగదారులను తమ ఫోన్లతో ఆకట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఐక్యూ కూడా అలాంటి ఓ నూతన స్మార్ట్ ఫోన్‌ను తాజాగా భారత మార్కెట్లో విడుదల చేసింది. ఐక్యూ 15 పేరిట ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. ఇందులో పలు అద్భుతమైన ఫీచర్లను అందిస్తున్నారు. ఐక్యూ నుంచి విడుదలైన లేటెస్ట్ ఫ్లాగ్ షిప్ స్మార్ట్ ఫోన్ ఇదే కావడం విశేషం. ఇందులో 6.85 ఇంచుల లెడ్ ఓలెడ్ డిస్ప్లేను ఏర్పాటు చేశారు. ఇది 2కె రిజల్యూషన్‌ను, 144 హెడ్జ్ రిఫ్రెష్ రేట్‌ను కలిగి ఉంది. అందువల్ల డిస్ప్లే క్వాలిటీ అద్భుతంగా ఉంటుంది. నాణ్యమైన దృశ్యాలను తెరపై వీక్షించవచ్చు. ఈ ఫోన్‌కు ఏకంగా 6000 నిట్స్ వరకు పీక్ బ్రైట్ నెస్ ఫీచర్‌ను అందిస్తున్నారు. అందువల్ల సూర్యకాంతిలోనూ ఈ ఫోన్ డిస్ప్లే చాలా స్పష్టంగా కనిపిస్తుంది.
ఈ ఫోన్ డిస్ప్లేకు డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంది. కనుక సినిమాలను అద్భుతమైన క్వాలిటీతో వీక్షించవచ్చు. ఈ ఫోన్‌ను ఆల్ఫా ఎడిషన్, లెజెండ్ ఎడిషన్ లలో లాంచ్ చేశారు. ఈ ఫోన్లో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జెన్ 5 ఆక్టాకోర్ ప్రాసెసర్‌ను ఇచ్చారు. ఈ ఫోన్లో ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారిత ఆరిజిన్ ఓఎస్ 6 లభిస్తుంది. దీనికి గాను 5 ఆండ్రాయిడ్ ఓఎస్ అప్డేట్స్ను, 7 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్డేట్స్ను అందిస్తామని కంపెనీ చెబుతోంది. ఈ ఫోన్లో ప్రత్యేకమైన కూలింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు. అందువల్ల ఫోన్‌ను ఎంత తీవ్రంగా ఉపయోగించినప్పటికీ అంత త్వరగా హీట్ కు గురికాదు. ముఖ్యంగా గేమర్లకు ఈ ఫోన్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇక ఈ ఫోన్లో వెనుక వైపు 50 మెగాపిక్సల్ కెపాసిటీ కలిగిన మూడు కెమెరాలను ఇచ్చారు. 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరాకు తోడుగా 50 మెగాపిక్సల్ టెలిఫొటో కెమెరా, 50 మెగాపిక్సల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరాలను ఇచ్చారు. ముందు వైపు 32 మెగాపిక్సల్ కెమెరా ఉంది. ఈ కెమెరాల సహాయంతో అద్భుతమైన ఫొటోలు, వీడియోలను చిత్రీకరించుకోవచ్చు.
ఈ ఫోన్లో ఏకంగా 7000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ కలిగిన బ్యాటరీని ఏర్పాటు చేశారు. దీనికి 100 వాట్ల ఫాస్ట్ చార్జింగ్, 40 వాట్ల వైర్ లెస్ చార్జింగ్కు సపోర్ట్‌ను కూడా అందిస్తున్నారు. అందువల్ల ఫోన్‌ను వైర్‌తో లేదా వైర్ లెస్‌గా కూడా వేగంగానే చార్జింగ్ చేసుకోవచ్చు. ఈ ఫోన్‌ను 12జీబీ, 16జీబీ ర్యామ్, 256జీబీ, 512జీబీ స్టోరేజ్ ఆప్షన్లలో లాంచ్ చేశారు. డ్యుయల్ సిమ్ లను వేసుకోవచ్చు. ఇన్ డిస్ప్లే అల్ట్రాసోనిక్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంది. ఇన్ ఫ్రారెడ్ సెన్సార్‌ను కూడా అందిస్తున్నారు. ఐపీ 68, 69 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ కూడా ఉంది. 5జి సేవలను ఉపయోగించుకోవచ్చు. డ్యుయల్ 4జి వీవోఎల్టీఈ ఫీచర్‌ను కూడా పొందవచ్చు. వైఫై 7, బ్లూటూత్ 6.0, యూఎస్బీ టైప్ సి, ఎన్ఎఫ్సీ వంటి అదనపు సదుపాయాలను సైతం ఇందులో అందిస్తున్నారు.
ఐక్యూ 15 స్మార్ట్ ఫోన్ కు చెందిన 12జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.72,999 ఉండగా, 16జీబీ ర్యామ్, 512జీబీ స్టోరేజ్ మోడల్ ధరను రూ.79,999గా నిర్ణయించారు. అయితే పలు రకాల ఆఫర్లను అందిస్తున్న కారణంగా ఈ ఫోన్‌ను రూ.64,999 ప్రారంభ ధరకు పొందవచ్చు. ఈ ఫోన్‌ను అమెజాన్‌తోపాటు ఐక్యూ ఆన్లైన్ స్టోర్ లో డిసెంబర్ 1 నుంచి విక్రయించనున్నారు. నవంబర్ 27 నుంచి ప్రీ బుకింగ్స్‌ను ప్రారంభిస్తారు. ఈ ఫోన్‌పై పలు ఆఫర్లను కూడా అందిస్తున్నారు. ఎంపిక చేసిన బ్యాంకులకు చెందిన కార్డులతో ఈ ఫోన్‌పై రూ.7వేల ఇన్ స్టంట్ డిస్కౌంట్‌ను పొందవచ్చు. పాత ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ చేస్తే అదనంగా మరో రూ.7వేల డిస్కౌంట్ ఇస్తారు. రూ.1000 కూపన్ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. ఈ ఫోన్‌ను ప్రీ బుకింగ్ చేసుకున్నవారికి అదనంగా 12 నెలల ఎక్స్టెండెడ్ వారంటీని అందిస్తున్నారు. అలాగే ప్రీబుకింగ్ చేసుకుంటే ఐక్యూకు చెందిన TWS 1e ఇయర్ బడ్స్‌ను ఉచితంగా పొందవచ్చు. ఈ ఫోన్‌పై 24 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.