Sultanabad | సుల్తానాబాద్ రూరల్, నవంబర్23 : సుల్తానాబాద్‌లో శ్రీ సత్య సాయి బాబా 100 వ జయంతి వేడుకలను ఆదివానం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో పేషంట్ల కు దుప్పట్లు, పండ్లు, బ్రెడ్లు, డోర్ మ్యాట్లు పంపిణీ చేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య భవన్ సమీపంలోని వాసవీ మాత దేవాలయంలో ముందుగా సత్య సాయి బాబా చిత్రపటానికి పూలమాలలు వేశారు.
అనంతరం భజనలు చేశారు. అనంతరం ఆర్యవైశ్య భవన్ నుండి ద్విచక్ర వాహనాల ర్యాలీతో పోలీస్ స్టేషన్ మీదుగా ఆసుపత్రి వరకు ర్యాలీ తీశారు. లాలపల్లి వాస్తవ్యులు క్రీస్తు శేషులు అల్లెంకి సుశీల-భూమయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు బంధువులతోపాటు ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి డాక్టర్లు, సిబ్బంది, ఆర్యవైశ్య సంఘం నాయకులు, సభ్యులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.