Sri Krishna Janmashtami | మారుతినగర్, ఆగస్టు 16 : మెట్పల్లి పట్టణంలోని శ్రీ మురళీకృష్ణ మందిరంలో ఆలయ అధ్యక్షుడు మైలారపు లింబాద్రి దంపతుల ఆధ్వర్యంలో శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఉత్సవమూర్తులకు పంచామృతాభిషేకాలు, విశేష లక్ష పుష్పార్చన సామూహిక ప్రత్యేక పూజలు వేద పండితుల మంత్రోత్సవాల మధ్య నిర్వహించారు.
అనంతర భక్తులు నగర సంకీర్తన, పల్లకి సేవ, భజన సంకీర్తనలతో పాటు ఉట్టి కొట్టడం తదితర కార్యక్రమాలను చేపట్టారు. కాగా పలువురు ప్రజాప్రతినిధులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో మెట్పల్లి పట్టణ ఆర్యవైశ్య అధ్యక్షుడు మైలారపు రాంబాబు, కమిటీ సభ్యులు, సంకీర్తన భజన మండలి సభ్యులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.