MLA Dr. Sanjay Kumar | జగిత్యాల, నవంబర్ 23 : మీ ఆధ్యాత్మికత తోనే ప్రపంచలో శాంతి మానసిక ప్రశాంతత వస్తుందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ అన్నారు. శ్రీ భగవాన్ శ్రీ సత్య సాయి బాబా శత జయంతి వేడుకలు సత్యసాయి మందిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సత్య సాయి సేవా సమితి జగిత్యాల ఆధ్వర్యంలో నిరుపేద మహిళలకు కుట్టు మిషన్లు, దివ్యాంగులకు ట్రై సైకిల్స్, వీల్ చైర్స్, నిరుపేద విద్యార్థులకు సైకిళ్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బాబా శత జయంతి వేడుకలలో పాల్గొనడం తన అదృష్టం గా భావిస్తున్నా అని, 200 దేశాలలో సత్య సాయి ట్రస్ట్ సేవలు అందిస్తున్నారని తెలిపారు.
కోట్లాది భక్తులకు ఆరాధ్య దైవం గా సత్య సాయి బాబా ను ప్రార్తిస్తున్నారనీ, ప్రపంచ వ్యాప్తంగా శత జయంతి వేడుకలు జరుగుతున్నాయని తెలిపారు. గతంలో ఉచిత గుండె శస్త్ర చికిత్సలు సత్య సాయి ట్రస్ట్ లో మాత్రమే నిర్వహించేవారని, రాయలసీమ అంటే నీటి కరువుకు పేరు అని, అలాంటి ప్రాంతంలో ఇంటింటికి నీరు అందించే కార్యక్రమం సత్య సాయి ట్రస్ట్ చేపట్టి నీటి కరువు లేకుండా చేసిందన్నారు.
జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో పేద ప్రజలకు భోజనం మంచి కార్యక్రమం సత్య సాయి ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్నారని, నూతన ఆసుపత్రిలో కూడా సత్య సాయి అన్నదానానికి ప్రత్యేక గది కేటాయించడానికి కృషి చేస్తానన్నారు. మానవ సేవే మాధవ సేవ అని, ప్రపంచం లో అశాంతి కుటుంబంలో తగాదాలు ఉన్న పరిస్థితుల్లో ఆధ్యాత్మికత, భక్తి ద్వారానే మానసిక ఉల్లాసం శాంతి కలుగుతాయి అన్నారు. సత్య సాయి ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ బోడ్ల జగదీష్, సత్య సాయి సేవా సమితి సభ్యులు సాయిరాం రాజు, భాస్కర్, భూషణం, నాయకులు రవి తదితరులు పాల్గొన్నారు.