SARANGAPOOR |సారంగాపూర్ : సారంగాపూర్ మండలంలోని రంగంపేట, ఓడ్డెర కాలనీ గ్రామాల్లో జడ్పీ మాజీ చైర్మన్ దావా వసంత హనుమాన్ దీక్షలు చేస్తున్న స్వాములతో కలిసి ఆదివారం హనుమాన్ ఆలయల్లో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా దావా వసంత ను శాలువాలతో హనుమాన్ దీక్షపరులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు తెలు రాజు, సీనియర్ నాయకులు సాగి సత్యం రావు, మహిపాల్ రెడ్డి, గంగారెడ్డి, బాపిరాజు, రమేష్, తిరుపతి, వెంకటేష్, కిషన్, సురేష్, లవన్, కాసు తిరుపతి, సాయి, హనుమాన్ భక్తులు తదితరులు పాల్గొన్నారు.