గంభీరావుపేట, ఫిబ్రవరి 7 : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఎమ్మెల్యే కేటీఆర్ శుక్రవారం గంభీరావుపేటలో పర్యటించారు. రెడ్డి సేవా సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్మించిన మహంకాళీ అమ్మవారి ఆలయంలో నిర్వహించిన హోమం, పూర్ణాహుతి కార్యక్రమానికి హాజరయ్యారు. అనంతరం అమ్మవారిని దర్శించుకున్నారు. తర్వాత ఆలయ కమిటీ ఆధ్వర్యంలో రామన్నను సన్మానించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. మహంకాళీ అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని, అందరూ చల్లగా ఉండాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం, కాంగ్రెస్ సిరిసిల్ల ఇన్చార్జి కేకే మహేందర్‌రెడ్డి, సెస్ డైరెక్టర్ గౌరినేని నారాయణరావు, మాజీ ఎంపీపీ కరుణ, మాజీ జడ్పీటీసీ విజయ, నాయకులు కూర అంజిరెడ్డి, చక్రధర్‌రెడ్డి, గుండారపు కృష్ణారెడ్డి, వెంకటస్వామిగౌడ్, హమీద్, హన్మాండ్లు, తిరుపతి, లక్ష్మణ్, సురేందర్‌రెడ్డి, దయాకర్‌రావు పాల్గొన్నారు.