MLA Medipalli Satyam | గంగాధర, నవంబర్ 17: చొప్పదండి నియోజకవర్గం లోని ప్రతిపల్లెను అభివృద్ధి చేయడానికి ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు. గంగాధర మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గట్టుభూత్కూర్లో రూ.20 లక్షలు, గంగాధరలో రూ.20 లక్షలతో నిర్మిస్తున్న ఆరోగ్య ఉప కేంద్రాల భవన నిర్మాణానికి, వెంకంపల్లిలో రూ.20 లక్షలతో నూతన గ్రామపంచాయతీ భవన నిర్మాణానికి, రూ.5 లక్షలతో ప్రెస్ క్లబ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
గంగాధరలో రూ. 44 లక్షలతో , మధురానగర్ లో రూ.11 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్లు, రూ.11 లక్షలతో మండల కేంద్రంలోని ఎస్సీ బాయ్స్ హాస్టల్ మరమ్మతు పనులు, మండల కేంద్రంలో రూ.5 లక్షలతో నిర్మించిన సబ్ డివిజన్ కాంపౌండ్ వాల్, రూ.5 లక్షలతో నిర్మించిన బతుకమ్మ ఘాట్, రూ.5 లక్షలతో అంబేద్కర్ సంఘ భవనంలో వేసిన సీసీ ప్లాట్ ఫామ్ ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని పల్లెల అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వం పని చేస్తుందని తెలిపారు. నియోజకవర్గం లోని ప్రతి పల్లెను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, రాష్ట్రానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతామన్నారు.
చొప్పదండి నియోజకవర్గంలో ఇప్పటికే ప్రభుత్వ డిగ్రీ కళాశాలను మంజూరు చేయించినట్లు తెలిపారు. నారాయణపూర్ రిజర్వాయర్ కింద ముంపునకు గురవుతున్న భూములు ఇండ్లకు సంబంధించి నిర్వాసితులకు రూ. 23.50 కోట్లు మంజూరు చేయించినట్లు తెలిపారు. చొప్పదండి నియోజకవర్గం ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయనని, రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి పథంలో నిలుపుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ సంక్షేమ ప్రజల్లో ప్రచారం చేయాలని, రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించే దిశగా పనిచేయాలని సూచించారు. పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపునిచ్చి కాపాడుకుంటామని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గంగాధర మార్కెట్ కమిటీ చైర్మన్ జాగిరపు రజిత శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ వెలిచాల తీర్మల్ రావు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ వేముల భాస్కర్, ఎంపీడీవో రామ్, మండల అధ్యక్షుడు పురుమల్ల మనోహర్,బుచ్చన్న, రామిడి రాజిరెడ్డి,పడాల రాజన్న,తాళ్ళ శ్రీనివాస్, గంగాధర ప్రవీణ్, తాళ్ళ సురేష్, బుర్గు గంగన్న, రాజగోపాల్ రెడ్డి, దోర్నాల శ్రీనివాస్ రెడ్డి, సత్తు కనుకయ్య, పడితపల్లి కిషన్, తోట సంధ్య, వేముల అంజి, రోమాల రమేష్, బాపు రెడ్డి, మేర్జ కొండయ్య, స్వామి, గరిగంటి కరుణాకర్, దీకొండ మధు, సతీష్, మహేష్, శంకరయ్య, చందు, నగేష్, కొల ప్రభాకర్, మ్యాక వినోద్, మహేష్, గంగివేణి నవీన్, మంత్రి మహేందర్ పాల్గొన్నారు.
మానవత్వాన్ని చాటుకున్న ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
గంగాధర మండలం కురిక్యాల గ్రామానికి చెందిన భీమనాతిని సత్యవ్వ అనే మహిళ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడింది. కాగా గంగాధర మండలంలో వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం కోసం అటుగా వెళుతున్న చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రమాదాన్ని గమనించి తన వాహనాన్ని ఆపి గాయపడిన మహిళను దగ్గరుండి స్థానిక పోలీస్ వాహనంలో కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు. కరీంనగర్ లోని ఆసుపత్రి వైద్యులతో ఫోనులో మాట్లాడి గాయపడిన మహిళకు మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.