Vemulawada | వేములవాడ, జనవరి 29: మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు మున్సిపల్ కార్యాలయం నుండి కావలసిన ధ్రువ పత్రాలను తీసుకునేందుకు ప్రత్యేక కౌంటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. కానీ దీనిపై స్పష్టమైన ప్రచారం లేకపోవడంతో కార్యాలయానికి వచ్చే ప్రజలు గురువారం ఇబ్బందులు పడుతున్నారు.
మున్సిపల్ కార్యాలయంకు వచ్చే అభ్యర్థులు ప్రజలకు ధృవపత్రాలను ఇచ్చేందుకు ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేసినట్లు కనీస సమాచారంతో కూడిన ఒక ఫ్లెక్సీ ని కూడా సంబంధిత అధికారులు ఏర్పాటు చేయలేదు. నామినేషన్ వేసే అభ్యర్థులను తనిఖీ చేసిన తర్వాతే ఒక అభ్యర్థితో ఇద్దరిని మాత్రమే అనుమతిస్తుండగా ధృవపత్రాల కోసం వచ్చిన వారికి ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశారని భద్రత సిబ్బంది వెల్లడిస్తుండడంతోనే విషయం కాస్త తెలుస్తోంది. అయితే ఆ భవనం కూడా ఎక్కడ ఉందనేది ఇక్కడికి వచ్చే అభ్యర్థులు ప్రజలకు సరైన సమాచారం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.