Electricity Problems | చిగురుమామిడి, జనవరి 20: చిగురుమామిడి మండల కేంద్రంలోని సబ్ స్టేషన్ పరిధిలో ఉన్న గ్రామాల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించేందుకు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్నామని ట్రాన్స్కో ఏఈ ప్రకాశం అన్నారు. మండల కేంద్రంలో గ్రామ సర్పంచ్ ఆకవరం భవాని, వార్డు సభ్యులతో కలిసి సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాలను పరిశీలించారు.
తుప్పు పట్టిన స్తంభాలను తొలగింపు, కరెంటు స్తంభాల లూజ్ లైన్ సరి చేయడం, 45 విద్యుత్ స్తంభాలను అవసరమైన ప్రదేశంలో నెలకొల్పుటకు పరిశీలించినట్లు పేర్కన్నారు. మండల కేంద్రంలో విద్యుత్ సమస్య లేకుండా చూడాలని, ప్రభుత్వ కార్యాలయాలకు అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని సర్పంచ్ ఏఈని కోరారు. వీరి వెంట ఉప సర్పంచ్ కాశబోయిన విజయలక్ష్మి, పంచాయతీ కార్యదర్శి కాల్వ రమేష్, కారోబార్ గొల్లపల్లి సత్యనారాయణ, వార్డు సభ్యులు, విద్యుత్ సిబ్బంది ఉన్నారు.