రామగిరి మార్చి 06 : హైదరాబాద్‌లో సాఫ్ట్ వేర్ (Software )ఉద్యోగం చేస్తున్న లద్నపూర్ గ్రామ నివాసి తంగళ్లపల్లి రాజేందర్, లిఖిత దంపతులు సింగరేణి యువ బలగం చేస్తున్న కార్యక్రమాలకు ఆకర్షితులయ్యారు. వారి పెళ్లిరోజు సందర్భంగా తమవంతు సహాయం చేయాలని నిర్ణయించుకొన్నారు. ఇందులో భాగంగా గురువారం సింగరేణి యువ బలగం ప్రతినిధి వీరగోని సంతోష్ గౌడ్‌ను సంప్రదించగా వెంటనే సభ్యులతో చర్చించి లద్నపూర్ గ్రామానికి చెందిన జహర అనే నిరుపేద మహిళకు రాజేందర్ చేతుల మీదుగా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు.
సింగరేణి యువ బలగం ద్వారా చేస్తున్న కార్యక్రమాలకు వస్తున్న స్పందన హర్షించదగిన విషయం అన్నారు. రాబోయే రోజుల్లో దాతల సహకారంతో మరిన్ని కార్యక్రమాలు చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సింగరేణి యువ బలగం సభ్యులు బుడిగే క్రాంతి, మేకల మారుతి యాదవ్, మండ సురేష్, పాశం శ్రీనివాస్ రెడ్డి, అత్తే బాబు జోసెఫ్, తదితరులు పాల్గొన్నారు.