Kalvasrirampur | కాల్వ శ్రీరాంపూర్, ఫిబ్రవరి 10 : ఇటీవల ఘన తంత్ర దినోత్సవం సందర్భంగా ఉత్తమ సామాజిక సేవా కార్యకర్తగా అవార్డు పొందిన తారుపల్లి ఉన్నత పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు కూరపాటి సత్య ప్రకాష్ రావు ను గ్రామ సభ సందర్భంగా పంచాయతీ పాలకవర్గం మంగళవారం ఘనంగా సన్మానించింది.
గణతంత్ర దినోత్సవ సందర్భంగా హనుమకొండ కలెక్టర్ చేతుల మీదుగా అవార్డు తీసుకోవడం గ్రామానికి గర్వకారణమన్నారు. సర్పంచ్ గాజవేన స్వరూప సదయ్య, ఉప సర్పంచ్ ఆముదాల స్వామి, గ్రామ కార్యదర్శి సందీప్, వార్డు సభ్యులు, గ్రామస్తులు, ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు రమేష్, రాజేందర్ శాలువాతో ఘనంగా సన్మానించారు. సత్య ప్రకాష్ రావు ఇంకా ఎన్నో అవార్డులు సాధించాలని కోరారు.