Mallapur | మల్లాపూర్, ఏప్రిల్ 5 : మల్లాపూర్ మండల కేంద్రానికి చెందిన ఏనుగు వెంకట రెడ్డి అనే సామాజిక కార్యకర్త గత రెండు రోజులుగా మల్లాపూర్ లోని 14 వ వార్డు పరిసరాల్లో డ్రైనేజీ లు శుభ్రం చేస్తున్నారు. ఈ సందర్భంగా వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలు పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. తడి చెత్త, పొడి చెత్త వేరు వేరు గా చేసి చెత్త కుండీ లలో పారవేయాలని కోరారు. ఈ సేవలని పలువురు అభినందించారు.