Snake Catcher | రామగిరి, మార్చి 09 : పెద్దపల్లి జిల్లా బేగంపేట గ్రామానికి చెందిన స్నేక్ క్యాచర్ పోతారావేణి భాస్కర్ అలియాస్ పాముల భాస్కర్ ఆదివారం తెల్లవారుజామున అనారోగ్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
భాస్కర్ గత 20 ఏండ్లుగా సింగరేణి, సమీప గ్రామాల్లో ఎక్కడైనా ఎవరి ఇంట్లోనైనా పాములు దూరి భయబ్రాంతులకు గురి చేస్తున్నట్లు సమాచారం అందితే చాలు క్షణంలో అక్కడికి చేరుకుంటాడు. ఎంతటి విష సర్పాన్నైనా పట్టుకొని సురక్షితంగా అటవీ ప్రాంతంలో వదిలేసేవాడు. పాములు పట్టడంలో ఎంతో నేర్పరియైన భాస్కర్ కొంత మంది యువకులకు కూడ పాములు పట్టడంలో శిక్షణ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు. భాస్కర్ అకాల మృతి పట్ల పలువురు రాజకీయ నాయకులు, అధికారులు తమ సంతాపం వ్యక్తం చేశారు.