Donating blood | కోల్ సిటీ, అగస్టు 29: గోదావరిఖనికి చెందిన వశిష్క అనే ఆరేళ్ల బాలిక ఆనారోగ్యంతో బాధపడుతుండగా తల్లిదండ్రులు గోదావరిఖని ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. ఆపదలో ఉన్న బాలికకు శుక్రవారం అత్యవసరంగా ఏ-పాజిటివ్ రక్తం రెండు యూనిట్లు ఎక్కించాలని వైద్యులు తెలిపారు.
దీనితో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురై యైటింక్లయిన్ కాలనీ పట్టణంలోని వై.కే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కండెం సురేష్ ను సంప్రదించారు. దీనితో ఆ ఫౌండేషన్ సభ్యులు అరిగెల వెంకటేష్, రామకృష్ణ స్పందించి హుటాహుటినా ఆస్పత్రికి చేరుకొని తమ ఏ పాజిటివ్ రక్తదానం చేసి అదుకున్నారు. ఈమేరకు ఆపత్కాలంలో రక్తదానం చేసి బాలిక ప్రాణాలు కాపాడిన ఇరువురిని వైకే ఫౌండేషన్ వ్యవస్థాపకుడు సురేష్, గౌరవ సలహాదారులు విజేందర్ రెడ్డి, సభ్యులు శివాజీ, అనిల్, సాయిలుతోపాటు కుటుంబ సభ్యులు, ఆస్పత్రి వైద్యులు ప్రత్యేకంగా అభినందించారు.