కరీంనగర్ కార్పొరేషన్, జూన్ 12: కాంగ్రెస్ అధికారం చేపట్టి ఆరు నెలలు దాటినా అర్హులందరికీ ఆరు గ్యారెంటీలు అందలేదు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నా సర్కారు అమల్లోకి తెచ్చిన రెండు పథకాలు వర్తించలేదు. ఇన్ని రోజులు పార్లమెంట్ ఎన్నికల కోడ్‌తో ఆగినా.. ఈ నెల 6న కోడ్ ముగియడంతో మళ్లీ స్కీంల కోసం పంచాయతీ, మున్సిపల్ ఆఫీసులకు పరుగెడుతున్నారు.
బుధవారం కరీంనగర్ బల్దియాలో ఏ ర్పాటు చేసిన కౌంటర్ల వద్ద గ్యాస్ కనెక్షన్, కరెంట్ మీటర్ల నంబర్లను లింక్ చేసుకొనేందుకు అర్జీదారులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. గంటల తరబడి క్యూలైన్లలో నిల్చుండి అవస్థలు పడ్డారు.