MLA Medipally Sathyam | గంగాధర, మార్చి 27: గంగాధర మండలంలోని ర్యాలపల్లి, బూరుగుపల్లి, కోట్లనరసింహులపల్లి, లక్ష్మీదేవిపల్లి, గంగాధర, మధురానగర్, మల్లాపూర్, కురిక్యాల, ఉప్పరమల్యాల, కాసారం, గర్శకుర్తి, గట్టుభూత్కూర్ గ్రామాల్లో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఆలయాలను ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయ పురోహితులు సీతారాముల కల్యాణాన్ని కన్నుల పండువగా నిర్వహించారు. ఈ తంతులో మహిళలు అమ్మవారికి ఓడి బియ్యం పోసి మొక్కలు చెల్లించుకున్నారు.
అనంతరం నిర్వాహకులు భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉప్పరమల్యాల, కురిక్యాల, మధురానగర్ లో నిర్వహించిన శ్రీరామనవమి వేడుకల్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం పాల్గొన్నారు. ఉప్పరమల్యాలలో స్వామివారి కల్యాణానికి కొండగట్టునుండు వచ్చిన పట్టు వస్త్రాలను ఎమ్మెల్యే సమర్పించారు. శ్రీరామనవమి వేడుకలను మండల ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. కార్యక్రమంలో కురిక్యాల సింగిల్ విండో మాజీ చైర్మన్ వెలిచాల తిరుమలరావు, పురుమల్ల మనోహర్, సర్పంచులు ముద్ధం నగేష్, కడారి రేణుక కనకయ్య, వేముల భాస్కర్, మాజీ వైస్ ఎంపీపీ కర్ర బాపురెడ్డి, నాయకులు కర్ర కార్తీక్ రెడ్డి, కనకట్ల తిరుపతి తదితరులు పాల్గొన్నారు.