సిరిసిల్ల టౌన్/ కలెక్టరేట్ ఏప్రిల్ 13: ఆస్తి పన్ను వసూళ్లలో సిరిసిల్ల మున్సిపాలిటీ రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తున్నది. మంత్రి కేటీఆర్ మార్గదర్శనంలో మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, అధికారుల బృందం పకడ్బందీ ప్రణాళికతో ఆస్తి పన్ను వ సూ లు చేస్తున్నారు. వార్డుల వారీగా ప్రత్యేక బృం దాలను ఏర్పాటు చేయడంతోపాటు స్థానిక ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేశారు. ప్రజాప్రతినిధులు, సమాఖ్య సంఘాల సభ్యులు, అందరి సహకారంతో దాదాపు వంద శాతం ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియను పూర్తి చేశారు.
ఐదేండ్ల నుంచి ఆదర్శంగా..
ఆస్తి పన్ను వసూళ్లలో గత ఐదేండ్లుగా సిరిసిల్ల మున్సిపాలిటీ రికార్డును సొంతం చేసుకుంటున్నది. 2018-19లో 3.90 కోట్ల డిమాండ్‌కు వందశాతం, 2019-20లో 4.20 కోట్లకు వం దశాతం, 2020-21లో 4.32 కోట్లకు వందశాతం, 2021-22లో 4.16 కోట్లకు 4.12 కోట్లు (99.17శాతం) వసూలు కాగా, ఇదే స్ఫూ ర్తితో ప్రస్తుతం 2022-23లో 4.94 కోట్లకు 4.91 కోట్ల (99.39 శాతం) ఆస్తి పన్ను వసూలు చేసి రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. అందులో నాన్ రెసిడెన్సీ 1.29 కోట్ల డిమాండ్‌కు 1.29 కోట్లు (99.66 శాతం), రెడినెన్షియల్ 2.42 కోట్ల డిమాండ్‌కు 2.40 కోట్ల (98.51 శాతం) పన్నులు వసూలు చేసింది.
కమిషనర్‌కు మంత్రి కేటీఆర్ అభినందన
“నేను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం నుంచి సిరిసిల్ల మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తున్నది. పన్ను వసూళ్లలో ముందంజలో నిలిపిన కమిషనర్ సమ్మయ్య, అతడి బృం దానికి అభినందనలు..” అంటూ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా పోస్ట్ చేశారు. కలెక్టర్ అనురాగ్ జయంతి కూడా తన అధికారిక ట్విట్టర్లో ఇదే అంశంపై అధికారులను అభినందిస్తూ పోస్ట్ చేశారు. ప్రతిగా మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య మంత్రి కేటీఆర్, కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ ఇరువురి మార్గదర్శనం, సహకారం వల్లే ఈ ఘనత సాధ్యమైందని పేర్కొన్నారు.
అందరి సహకారంతోనే..
మంత్రి కేటీఆర్, కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శనం, సహకారంతోనే ఈ ఘనత సాధ్యమైంది. ఆస్తి ప న్ను వసూళ్లలో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవడం సంతోషకరమైన విషయం. ఇదే స్ఫూర్తిని కొనసాగిస్తూ మరిన్ని కార్యక్రమాల నిర్వహణకు ప్ర ణాళికలు రూపొందిస్తున్నాం. అన్ని విభాగాల్లో సిరిసిల్లను ఆదర్శంగా నిలిపేందుకు కృషి చేస్తా.
– సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (సిరిసిల్ల)
మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు
మంత్రి కేటీఆర్ సహకారంతో సిరిసిల్ల మున్సిపాలిటీని అన్ని రంగాల అభివృద్ధిలో ముందు వరుసలో నిలుపుతు న్నాం. ఆస్తి పన్ను వసూళ్లలో అధికారులకు ప్రజాప్రతినిధులు ఎంతో సహకరించారు. వంద శాతం పన్నులు చెల్లించిన ప్రజలు, మార్గదర్శనం చేసిన మంత్రి కేటీఆర్‌కు కృతజ్ఞతలు. ఇదే స్ఫూర్తితో మరింత వృద్ధి చేస్తాం.
– జిందం కళ, మున్సిపల్ చైర్పర్సన్ (సిరిసిల్ల)