సిరిసిల్ల రూరల్, నవంబర్ 4: బీఆర్ఎస్ సిరిసిల్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి రామన్నకు ప్రజానీకం జై కొడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో లక్ష మెజార్టీ అందిస్తామని పేర్కొంటున్నారు. గ్రామాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఇంటింటా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా శనివారం బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అభివృద్ధి ప్రదాత మంత్రి కేటీఆర్‌ను మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సిరిసిల్ల 9వ వార్డు పరిధిలోని తుర్కకాశీపల్లె, బాబాజీ నగర్లో ఇన్చార్జి బొల్లి రామ్మోహన్, బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, ఆర్బీఎస్ మండల కన్వీనర్ వొజ్జల అగ్గిరాములుతో కలిసి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. తుర్కకాశీపల్లె, బాబాజీనగర్ వాసులు కేటీఆర్‌కు సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇక్కడ ప్యాక్స్ చైర్మన్ జీల కిషన్ యాదవ్, షేక్ అలీ, జూపల్లి శ్రీనాథరావు, గండ్ర రమేశ్‌రావు, విడుగురాళ్ల బాలరాజుగౌడ్, జెట్టి దేవయ్య, నారాయణ, కొండపల్లి లింగం, కళ్లెం లక్ష్మణ్ ఉన్నారు.
మంత్రికేటీఆర్‌కు మరోసారి పట్టం కట్టాలని సెస్ చైర్మన్ చిక్కాల రామారావు పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం మల్లాపూర్, దేశాయిపల్లెలో పార్టీ మండలాధ్యక్షుడు గజభీంకార్ రాజన్న, ఎంపీపీ పడిగెల మానస, ఏఎంసీ చైర్ పర్సన్ పూసపల్లి సరస్వతితో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మల్లాపూర్‌లో భారీ ర్యాలీ తీసి, ఇంటింటా ఓట్లను అభ్యర్థించారు. మంత్రి కేటీఆర్‌ను పెద్ద మనస్సుతో ఆశీర్వదించాలని, కారు గుర్తుకు ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. గ్రామాభివృద్ధి ప్రగతి పత్రాలు,మ్యానిఫెస్టో పత్రాలను అందించి ప్రచారం చేశారు. తంగళ్లపల్లి, మండెపల్లి, చింతలఠాణా, చీర్లవంచలో బీఆర్ఎస్ నాయకులు ప్రచారం నిర్వహించారు. ఆయా కార్యక్రమాల్లో బీఆర్ఎస్ సీనియర్ నేతలు పడిగెల రాజు, పుర్మాణి రాంలింగారెడ్డి, ఏఎంసీ చైర్మన్ సింగిరెడ్డి రవీందర్‌రెడ్డి, సర్పంచులు అంకారపు అనిత, పరశురాములు, నకీర్తి బాలమల్లు, ఉమారాజు, శివజ్యోతి ఎంపీటీసీలు గుగ్గిల్ల లావణ్య, కోడి అంతయ్య, గుగ్గిల్ల ఆంజనేయులుగౌడ్, బుస్స స్వప్న, ప్యాక్స్ వైస్ చైర్మన్ ఎగుమామిడి వెంకటరమణారెడ్డి, బండి జగన్, సురువు వెంకట్, మాసిపెద్ది రవీందర్రావు, రమణారావు, భూపతిరావు, రాంచందర్‌రావు, అన్రెడ్డి రాజిరెడ్డి, శ్రీకాంత్‌రావు, సురేశ్, సింగిరెడ్డి ముత్యంరెడ్డి, రామచంద్రం, మదన్‌రెడ్డి ఉన్నారు.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేట, పెద్దూరు, రగుడు,రాజీవ్‌నగర్, చిన్నబోనాల, పెద్దబోనాల, సర్దాపూర్‌లో ఇంటింటా తిరుగుతూ ఓట్లను అభ్యర్థించారు. ఇక్కడ కౌన్సిలర్లు పాతూరి రాజిరెడ్డి, ఒగ్గు ఉమ, రాజేశం,బుర్ర లక్ష్మి, రెడ్యానాయక్, లింగంపల్లి సత్యనారాయణ, పోచవేణి సత్య,పార్టీ నేతలు నర్మేట ప్రభుదాస్, వీరగోని శ్రీనివాస్, షేక్ అలీ, నర్సయ్య, శ్రీనివాస్‌గౌడ్, తిరుపతిరెడ్డి పాల్గొనారు.
వీర్నపల్లి, నవంబర్ 4: అభివృద్ధి ప్రదాత రామన్నను భారీ మెజార్టీతో గెలిపించాలని బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గుజ్జుల రాజిరెడ్డి పిలుపునిచ్చారు. జవహర్నాయక్తండాలో కేటీఆర్‌కు మద్దతుగా ఇంటింటా ప్రచారం నిర్వహించి, కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఇక్కడ సర్పంచ్ భూక్యా శ్రీనివాస్, ఏఎంసీ వైస్ చైర్మన్ తులసీరాం, మండల కో ఆప్షన్ సభ్యుడు ఉస్మాన్, నేతలు సంతోష్‌నాయక్, దర్సింగ్ ఉన్నారు.
ఎల్లారెడ్డిపేట, నవంబర్ 3: నియోజక వర్గంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అభివృద్ధిని చూసి మరోమారు భారీ మెజార్టీతో గెలిపించాలని జడ్పీటీసీ చీటి లక్ష్మణ్‌రావు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. శనివారం బండలింగంపల్లి, సింగారం, కోరుట్లపేటలో ప్రచారం నిర్వహించారు. మండల కేంద్రంలోని ఒడ్డెర కాలనీ, డబుల్బెడ్రూం కాలనీ, పద్మశాలి వీధిలో ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి మమతారెడ్డి బీఆర్ఎస్ మహిళానేతలతో కలిసి ప్రచారం చేశారు. ఎంపీపీ పిల్లి రేణుక, వైస్ ఎంపీపీ కదిరె భాస్కర్‌గౌడ్, బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వర్స కృష్ణహరి, ఏఎంసీ చైర్మన్ ఎలుసాని మోహన్, అందె సుభాష్, మాజీ చైర్మన్ కొండ రమేశ్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ గుండారపు కృష్ణారెడ్డి, మంగోలి నర్సాగౌడ్, సింగారం మధు, సింగారం దేవరాజు, కొత్తపల్లి నర్సింలు, బాల్రాజ్నర్సాగౌడ్, తాడ ప్రతాప్‌రెడ్డి, సురభి కాంతారావు, అఫ్సరున్నీసా ఉన్నారు.
గంభీరావుపేట, నవంబర్ 4: పదేళ్లుగా మంత్రి కేటీఆర్ చేసిన అభివృద్ధిని స్వాగతిస్తూ తిరిగి రామన్నను భారీ మెజార్టీతో గెలిపించుకుందామని జడ్పీటీసీ కొమిరిశెట్టి విజయ పిలుపునిచ్చారు. మండల కేంద్రంతో పాటు జగదాంబ తండాలో శనివారం మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో జడ్పీటీసీ విజయ పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలు, కొత్త మ్యానిఫెస్టోపై ప్రజలకు అవగాహన చేస్తూ ఓట్లను అభ్యర్థించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు పాపాగారి వెంకటస్వామిగౌడ్, ఏఎంసీ చైర్మన్ కొత్తింటి హన్మంతరెడ్డి, ఆర్బీఎస్ కన్వీనర్ రాజేందర్, నేతలు కొమిరిశెట్టి లక్ష్మణ్, వంగ సురేందర్‌రెడ్డి, లింగన్నగారి దయాకర్‌రావు, గంద్యాడపు రాజు, లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి, రాగిశెట్టి నారాయణ, చేరాల వెంకటస్వామిగౌడ్, శివయ్య, రత్నాకర్, భిక్షపతి, కాశీరాం, బాలశంకర్, పౌల్, శ్రీహరి ఉన్నారు.
గంభీరావుపేట, నవంబర్ 4: ముస్తాఫానగర్‌లో శనివారం కేటీఆర్ సేన రాష్ట్ర అద్యక్షుడు లక్కిరెడ్డి కమలాకర్‌రెడ్డి ముద్రించిన పథకాల టీషర్ట్‌లతో మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా బీఆర్ఎస్ యూత్ సభ్యులు ప్రజలకు అవగాహన కల్పించారు. పేదల సంక్షేమమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించిన మ్యానిఫెస్టో టీషర్టులు యువకులు వేసుకుని విన్నూతనంగా ఓటర్లకు అవగాహన చేశారు. బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే ఈ పథకాలన్నీ అందుతాయని తెలిపారు.
సిరిసిల్ల టౌన్, నవంబర్ 4: సిరిసిల్ల పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారం హుషారుగా సాగుతోంది. శనివారం 39వార్డులో కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిల నేతృత్వంలో నాయకులు గడపగడపకూ వెళ్లి పార్టీ మ్యానిఫెస్టో పత్రాలను అందజేశారు. కేసీఆర్ నాయకత్వంలో అమలుచేసిన, రాబోవు రోజుల్లో అమలుచేయనున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ మంత్రి కేటీఆర్‌కు మద్దతుగా ఓట్లు అభ్యర్థించారు. మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళ 3వ వార్డులో ప్రచారం చేశారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌కే విశ్రాంత ఉద్యోగుల సంపూర్ణ మద్దతు నిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ మోహన్‌రెడ్డి తెలిపా రు. శనివారం స్థానిక విశ్రాంత ఉద్యోగుల సంఘం భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశం లో ఆయన పాల్గొని మాట్లాడారు. విశ్రాంత ఉద్యో గుల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం విశేష కృషి చేసిందన్నారు. ఇక్కడ విశ్రాంత ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బలరాం, ప్రధాన కార్యదర్శి సుధాకర్, గౌరవాధ్యక్షుడు ఆకునూరి శంకరయ్య ఉన్నారు.
ముస్తాబాద్, నవంబర్ 4: ఆవునూరులో బీఆర్ఎస్ మ్యానిఫెస్టో పత్రాలతో నాయకులు జోరు గా ప్రచారం నిర్వహించారు. రామన్న చేసిన అభివృద్ధిని వివరిస్తూ కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ ఎంపీపీ జనగామ శరత్‌రా వు, ఆర్బీఎస్ కన్వీనర్ కల్వకుంట్ల గోపాల్‌రావు, జడ్పీటీసీ గుండం నర్సయ్య, సెస్ డైరెక్టర్ సందుపట్ల అంజిరెడ్డి, ఏఎంసీ చైర్మన్ అక్కరాజు శ్రీనివాస్, సహకార సంఘ అధ్యక్షుడు తన్నీరు బాపూరావు, రాజేందర్‌రెడ్డి, నాయకులు కొమ్ము బాల య్య, మల్లారెడ్డి, సతీశ్చంద్రారావు, నర్సింహారెడ్డి, మల్లేశ్‌యాదవ్, యాదగిరిగౌడ్, అంజన్‌రావు, సురేంద్రరావు, సర్పంచ్ సుమతి పాల్గొన్నారు.