Haney Bee attack | వీర్నపల్లి , ఏప్రిల్ 18: కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో రాజన్న సిరిసిల్ల కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, పలువురు కాంగ్రెస్ కార్యకర్తలపై శుక్రవారం తేనటీగలు దాడి చేశాయి.
శుక్రవారం వీర్నపల్లి మండల కేంద్రంలో మహిళ స్త్రీ శక్తి భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం కలెక్టర్ లాల్ సింగ్ తండాలో పర్యటించారు. అక్కడి నుంచి నేరుగా మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని అకస్మీక తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం , స్టోర్ రూంను పరిశీలించారు. ఇటీవల ఓ విద్యార్థిని పై అంతస్తు నుంచి దూకగా, ఆ కారిడర్ ను పరిశీలించేందుకు కలెక్టర్, అధికారులు , నేతలు మొదటి అంతస్తుకు చేరుకున్నారు.
దీంతో తేనటీగలు ఒక్కసారిగా కలెక్టర్లతో పాటు అక్కడున్న వారిపై దాడిచేశాయి. కలెక్టర్ ను, కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ చార్జీ కె.కె మహేందర్ రెడ్డితో పాటు పలువురిని పక్కనే ఉన్న గదికి చేరుకోని తలుపులు వేసుకున్నారు. ఈ ఘటనతో అక్కడున్న వారంతా ఉలిక్కి పడ్డారు.
Haney Bee attack at KGBV